Friday, 31 October 2014

I Movie Telugu Teaser


I Movie Telugu Teaser, విక్రమ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐ’ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ గురువారం విడుదల అయింది. ఒక నిమిషంకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ లో విక్రమ్ యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ‘‘త్వరలో మిమ్మల్ని చూస్తా’’ అంటూ ఓ భయంకరమైన లుక్ తో విక్రమ్ గెటప్ సూపర్ గా ఉంది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. తమిళంలో విడుదల అయిన పాటలు, ట్రైలర్ దుమ్ములేపటంతో పాటు.., యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.

For More Latest  Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon  to www.teluguwishesh.com

Current Teega Telugu Movie Review

Current Teega Movie Review, సినిమా కధ శివరామరాజు (జగపతి బాబు) ఛాలెంజ్ తో మొదలవుతుంది. తన ముగ్గురు కూతుళ్ళు తాను చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటారని వీర్రాజు (సుప్రీత్)తో శివరామరాజు ఛాలెంజ్ చేస్తాడు. ఆ ప్రకారంగానే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి. మూడవ కూతురు కవిత (రకుల్ ప్రీత్ సింగ్) కాలేజ్ చదివే అమ్మాయి. ఊర్లో ఉండే రాజు(మనోజ్) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. అలా ఉండలేక ఊర్లో అందరి విషయాల్లో వేలుపెట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇక ఊర్లో టీచర్ గా పనిచేసే సన్నీ (సన్నీలియోన్)ని రాజు ప్రేమిస్తాడు. ఆ తర్వాత సన్నీ ఏమంటుంది, మళ్ళీ రకుల్ తో ఎలా ప్రేమలో పడతాడు, శివరామరాజును ఎలా ఒప్పిస్తాడు అని సాగే కధను థియేటర్ లో చూడండి.

For More Latest  Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon  to www.teluguwishesh.com

Wednesday, 29 October 2014

రికార్డులు బద్దలు కొడుతున్న బాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్ బాద్ షాగా పేరున్న షారూక్ ఖాన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘హ్యాపి న్యూ ఇయర్’ కలెక్షన్ల వరద పారిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. ఇక తాజా లెక్కలను చూస్తే.., కళ్లు తిరగక మానదు. కొయిమొయి (koimoi.com) వెబ్ సైట్ లెక్కల ప్రకారం మంగళవారం వరకు ఈ సినిమా 136.86 కోట్ల రూపాయలు వసూలు చేసింది..

Read More

రియల్ హీరోలు అన్పించుకున్న స్టార్ బ్రదర్స్


రీల్ లైఫ్ హీరోలు సూర్య, కార్తి రియల్ లైఫ్ లో కూడా హీరోలు అన్పించుకున్నారు. ఈ మద్య వచ్చిన హుద్ హుద్ తుఫాను సందర్బంగా వీరిద్దరూ కలిసి రూ.50లక్షలు విరాళం ఇచ్చారు. తెలుగు పాపులర్ స్టార్లు కూడా ఇరవై లక్షలు ఇచ్చేందుకు ముందు వెనకా ఆలోచిస్తే తమిళ హీరోలైన వీరు తమ ఉదార స్వభావం చాటున్నారు. తాజాగా బాధితులకు మరింత సాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బాధితులకు ఇండస్ర్టీ తరపున సాయం చేసేందుకు ‘వియ్ లవ్ వైజాగ్’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Click Here to Know Full Story

పవన్ ఏమనుకుంటున్నాడు... కోర్టు కేసుపై ఎలా స్పందిస్తాడు..?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశలపై కోర్టు కేసు నీళ్ళు చల్లింది. సూపర్ హిట్ సినిమా అయినా సరే.., కేసు పడటంతో ఇప్పుడెలా చేయటం అని టాలీవుడ్ ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. పవన్ తో రీమేక్ చేయించాలని భావిస్తున్న ‘కత్తి’ సినిమాకు కష్టాలు ఇంకా వీడటం లేదు. పెద్ద వివాదాలను ఎదుర్కుని తమిళంలో విడుదల అయిన ఈ సినిమా సక్సెస్ పుల్ గా నడుస్తోంది. అయితే ఈ సినిమాను ఇప్పటికి వివాదాలు వదలటం లేదు. తాజాగా సినిమా లో ఉన్న కొన్ని సీన్లపై హీరో విజయ్, డైరెక్టర్ మురుగదాస్ కు కోర్టు నోటిసులు పంపింది.

Read More

సన్నీని రీప్లేస్ చేసిన శ్రద్ధా


బాలీవుడ్ హాట్ ఐటం బాంబ్ సన్నీ లియోన్ కు కాంపిటిషన్ మొదలయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఐటం రాణిగా ఉండగా..., కొత్తగా మరో తారను ఐటం భామగా చూపిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ‘ఉంగ్లీ’ సినిమాలో బాలీవుడ్ భామ శ్రధ్దా కపూర్ ఐటం సాంగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం విడుదల అయిన ‘ఉంగ్లీ’ టీజర్ లో శ్రధ్ధా చిట్టి పొట్టి బట్టలేసుకుని డాన్స్ ఆడింది. దీంతో ఈ అమ్మడిదే ఐటం సాంగ్ అని అభిమానులు చెప్పకుంటున్నారు. ఇక పాటలో హీట్ పెంచేందుకు మద్యలో ఇమ్రాన్ ఖాన్ వచ్చి జాయిన్ అయినట్లుగా టీజర్ ద్వారా తెలుస్తోంది.

Read Full Story